18px
#561Telugu Spiritual Song

Krupa kanikaramula maa devaa - Kruthangnatha narpintu

కృప కనికరముల మా దేవా - కృతజ్ఞతనర్పింతు

ప|| కృప కనికరముల మా దేవా - కృతజ్ఞతనర్పింతు
1. యెహోవా చేసిన ఉపకారములకై - ఆయనకేమి చెల్లింతును? యెహోవా నామమున - ప్రార్థన జేసెదను రక్షణ పాత్రచేబూని || కృప||
2. యెహోవాకు నా - మ్రెంుక్కుబడి చెల్లింతు - యెహోవా దాసుడను నేను యెహోవా ప్రజలలో యెరూషలేములో - ఎల్లప్పుడు స్తుతింతు || కృప||
3. తల్లి గర్భమున రూపింపబడక మునుపే - నన్ను ఎరిగితివి తల్లి గర్భమునుండి - బయలుపడకముందే ప్రతిష్ఠించితివి || కృప||
4. పూర్ణమనస్సుతో నన్ను వెదకిన - నన్ను కనుగొందురంటివి కరుణతో నీవే - నన్ను వెదకి రక్షించితివి ప్రభువా || కృప||
5. దూషకుడను హింసకుడను - హానికరుడనై యుంటిని దాసునిగా నన్ను జేసికొంటివి - దోషముల జూపి || కృప||
6. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమనియంటివి ఇది నీ పాప క్షమ కొరకై - చిందిన రక్తమంటివి || కృప||
7. నీదు కృపతో నాదు యేసు - నన్ను నీవు రక్షించితివి కాదునాదు క్రియలవలన - ఇది దేవుని వరమే || కృప||
8. చెప్పశక్యము మహిమా యుక్తము - నీవొసంగిన సంతోషము తప్పకుండ హల్లెలూయ పాటపాడెదన్ || కృప||