18px
#562Telugu Spiritual Song

Amoolya rakhtamu dwaaraa - rakshana pondina janulaaraa

అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా

ప|| అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను - పరిశుద్ధులారా పాడెదము
1. మన యౌవన జీవితముల్ - శరీరాశకు లోబరచి చెడుమాటలను పలుకుచు - శాంతిలేకయుంటిమిగా || అమూల్య ||
2. చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి || అమూల్య ||
3. నిత్యసత్య దేవుని - నామమున మొరలిడక స్వంత నీతితోడనే - దేవుని రాజ్యము కోరితిమి || అమూల్య ||
4. కనికరముగల దేవుడు - మానవ రూపము దాల్చెను ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను || అమూల్య ||
5. తన రక్త ధారలలో - మన పాపములను కడిగి మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో || అమూల్య ||
6. పాపులమైన మన మీద - తన యాశ్చర్య ఘన ప్రేమ కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము || అమూల్య ||
7. మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములన్ || అమూల్య ||