#563Telugu Spiritual Song
Viswaasa sahithamuganu - Prakatinchudi Yesuni
విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని
ప|| విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని
1. నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని (2)
పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో (2) || విశ్వాస ||
2. నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా
ఓర్పును ప్రేమను కల్గి - పోరాడుడి విజయముతో || విశ్వాస ||
3. ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు
అవిధేయత చూపకను - పోరాడుడి విజయముతో || విశ్వాస ||
4. క్రీస్తేసు మనసు కలిగి - సత్ర్కియలను జరిగించి
యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో || విశ్వాస ||
5. దీన మనసు కలిగి - ప్రియులారా లోబడియు
మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో || విశ్వాస ||
6. ఆత్మల రక్షణకొరకై - అర్పించుడి జీవితము
అంతమువరకు నిలిచి - పోరాడుడి విజయముతో || విశ్వాస ||
7. యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు
విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము || విశ్వాస ||
