#565Telugu Spiritual Song
Naa sankata dhukkamulella theeripoyegaa
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
ప|| నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయెను || నా ||
1. విలువైన గొర్రెపిల్ల రక్తముద్వారా - కలిగియున్న రక్షణలో దాగియుంటిని || నా ||
2. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను - ఇంకా నేను సీయోను కన్యుడను కాను || నా ||
3. మార్చబడు నాదు మారా మధురముగా - పారు జలము బండనుండి త్రాగుచుందును || నా ||
4. సౌందర్యమయమగు పరమకానాను - నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు || నా ||
5. ఆనందమే పరమానందమే - కానాను జీవితము నా కానందమే || నా ||
6. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు - నా దేవుడిచ్చు క్రొత్త్తమన్నా నాకు చాలును || నా ||
7. నాయేసు ప్రభువే నా బలము గానము - నా యేసుప్రభువే నా రక్షణ హల్లెలూయా || నా ||
