#566Telugu Spiritual Song
Rakshana ounnatyamu - rakshakude thelupunu
రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును
ప|| రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును
పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది
1. మలిన వస్ర్తమువలెనే - నిండియుంటిమి నిందలతో
తండ్రిమాదిరిగా మము వెదకివచ్చి - వింతగా మమ్ము రక్షించెను || రక్షణ ||
2. అరణ్యప్రదేశములో - పాడైన యెడారిలో కనుగొనెను
పరామర్శించెన్ - కనుపాపవలె గాచెన్ || రక్షణ ||
3. యాకోబువలె నుంటిమి - ఇశ్రాయేలుగా మార్చెను
తన స్వాస్థ్యముగా తన భాగముగా - తన జనముగానైతిమి || రక్షణ ||
4. పర్వతములను సృజించెన్ - శ్రేషష్ఠమైనవి నిచ్చెన్
అబ్రహం మోషే ఏలియా - యేసు ఎక్కిరి శిఖరములను || రక్షణ ||
5. పక్షిరాజువలె ప్రభువు - రెక్కలతో మము మోయున్
అలసట లేక మము పట్టుకొని - ఆకసమున నడుపును || రక్షణ ||
6. యేసుని సత్యములు - పర్వత శిఖరములు
పరిపూర్ణమగు ప్రభు రక్షణను - పరికింపజేయును || రక్షణ ||
7. యెషయా ప్రచవనములు - రక్షణ వివరములు
శిఖర శ్రేణి యనుభవములు - శిఖరముపై పొందుము || రక్షణ ||
