18px
#569Telugu Spiritual Song

Thama devunerugu vaaru chesedaru

తమ దేవునెరుగువారు చేసెదరు - శక్తితో గొప్ప కార్యములు

ప|| తమ దేవునెరుగువారు చేసెదరు - శక్తితో గొప్ప కార్యములు
1. ఇచ్ఛకపు మాటల వలన - అక్షయుని విడువరు తప్పుబోధల నెప్పుడు తృణీకరించెదరు || తమ ||
2. సత్యమును విడువరు - ఉత్తములుగ నడిచెదరు అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు || తమ ||
3. మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరు మంచి సాక్ష్యమును విడువరు - ఏకాంతులు కారు || తమ ||
4. ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించినను పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు || తమ ||
5. అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగినను సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు || తమ ||
6. శోధనలను జయించెదరు - బాధలను సహించెదరు నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు || తమ ||
7. అధిక జ్ఞానమును పొంది - తగ్గించుకొనెదరు తామే యేసుప్రభువును హెచ్చిందరు - హల్లెలూయ పాడెదరు || తమ ||