#570Telugu Spiritual Song
Siluvanu mosi Ee lokamunu - talakrindulu cheyu tarunamide
సిలువను మోసి ఈ లోకమును - తలక్రిందులు చేయు తరుణమిదే
ప|| సిలువను మోసి ఈ లోకమును - తలక్రిందులు చేయు తరుణమిదే
1. లే లెమ్ము సోదరుడా నిద్ర నుండి - ప్రకటించను యేసు నామమును
సోమరి యేల నిద్రించెదవు - ఈ ధరను లేపెడు సమయ మిదే || సిలువ ||
2. పరిశుద్ధాత్మ కవచము ' - డిగి - నీ నడుము కట్టి తయ్యారగుమా
సోదరుడా ప్రతి వీధికి వెళ్లి - సువార్తను చాటెడు సమయమిదే || సిలువ ||
3. లోక రక్షణకై ప్రభుయేసు - వీకతో నరుదెంచెను ఈ ధరకు
వెలుగును మనకు నిచ్చెను యేసు - తన స్తుతులను పాడెడు సమయమిదే || సిలువ ||
4. పాతాళమునకు కొనిపోయెడి నీ - పాప నిద్రను విడనాడు మిక
సిలువ మర్మము నెరుగు మిపుడే - కునికెడు సమయము కాదిది ప్రియుడా || సిలువ ||
5. రక్షింపబడుట కాశించినచో - పశ్చాత్తాప పడు మీ దినమే
కలుషాత్ముండా తడవేల నికన్ - కనుమా తీర్పు సమయమిదే || సిలువ ||
