#571Telugu Spiritual Song
Lokamunaku nannu - devaa naa devaa uppugaa jesitivi
లోకమునకు నన్ను - దేవా నా దేవా ఉప్పుగా జేసితివి
ప|| లోకమునకు నన్ను - దేవా నా దేవా ఉప్పుగా జేసితివి
అద్భుత దేవా నా దేవా - ఉప్పుగా జేసితివి
1. నరరూపధారి - పరలోక ఉప్పయి
ఘోరపాపినైన నన్ను - శుద్ధీకరించితివి || అద్భుత ||
2. యెరికో నీళ్ల - వలె నా జీవం
మరణచేదై యుండ నీవు - రుచిగా మార్చితివి || అద్భుత ||
3. నా రోత హృదయం - నూతనపరచి
పరమ ఉప్పుతోడ నీవు - నింపిన దేవుండవు || అద్భుత ||
4. పరులకు యిలలో - ప్రభుక్రీస్తు రుచిన్
నిరతమునే జూపునట్లు - క్రుమ్మరించుము నన్ను || అద్భుత ||
5. నీ నిత్యజీవం నీ సంతోషం - నిత్య సమాధానమిచ్చి భద్రపరచితివి || అద్భుత ||
6. దీనుడనై నే బహు దుఃఖపడిన - ఎన్నడైన విడువక శ్రేషష్ఠ ఉప్పుగా మార్చుచున్న || అద్భుత ||
7. జనులు నన్ను హింసించినపుడు - ఎన్ని చెడ్డమాటలన్న హల్లెలూయ పాడెదన్ || అద్భుత ||
