18px
#572Telugu Spiritual Song

Cheekati kaalamu vachuchunde - krupakaalamu nupayoginchu

చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించి

1. చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించి తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
ప|| తలుపులు తెరచియుండగానే - విరిగిన మనస్సుతో సాగెదవా? కాలమపాయముగా నుండె - సమయమున సద్వినియోగించు
2. బీడుభూములధికముగా - చూచిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు - ప్రేమావార్తను చాటించు || తలుపులు ||
3. ఎన్నో రాజ్యములీనాడు - దేవుని పనికి మూయబడె తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు || తలుపులు ||
4. విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదు అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను || తలుపులు ||
5. రానైయున్న బాధ్యతలు - మన కధికము ప్రియులారా మనకు జయము కలుగుటకై - వినయమున పోరాడెదము || తలుపులు ||
6. మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము || తలుపులు ||