#573Telugu Spiritual Song
Yesu Kristuni manchi shishyulamugaa -visvaasamutho sagedamu
యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
1. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
మనమందరమును ఆయన సేవను - ఏకమై సదా జేసెదము
ప|| మన యేసు ప్రభువు శ్రీఘముగ వచ్చును - అతి వేగముగా సేవ చేతుము
యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
2. అందరియెడల ప్రేమ జూపెదం - యేసుచెంతకు పిలిచెదము
అతి శ్రీఘంబుగ ఉత్సాంబుతో - రాజమార్గమును చూపెదము || మన ||
3. సాతాను దుర్గమును పడగొట్టి - ఇక యేసు కొరకే జీవింతుము
ఈ లోకమంతటన్ ప్రభుయేసు నామమున్ - ఎల్లవేళలందు చాటెదము || మన ||
4. ప్రాణాత్మ దేహములు ప్రభుసేవకే - ఇక జీవించుట తన కొరకే
అని నిశ్చయించుచు అందు నిలిచియుండి ప్రభుదినమందు హర్షింతుము || మన ||
