#574Telugu Spiritual Song
Mandalo cherani gorrelenno - kotlakoladiga kalavu ila
మందలో చేరని గొర్రెలెన్నో - కోట్లకొలదిగా కలవు యిల
ప|| మందలో చేరని గొర్రెలెన్నో - కోట్లకొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము
ఓ సంఘమా మందలో చేరని గొర్రెలెన్నో
రమ్మనె యేసు - ప్రార్థించుము నడిపించును
1. అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమే శ్రమపడితిన్ - మరి వారిని వెదకెడి వారెవరు || మందలో ||
2. ప్రకటించని స్థలములు కలవు - నన్ను చాటించువారు కలరిచట
పిలువబడిన వారందరును - మన ప్రభువాజ్ఞకు లోబడి రండి || మందలో ||
3. నాకై పలికెడి నాలుకలు - నావలె నడిచెడి పాదములు
నను ప్రేమించెడి హృదయములు - కావలె నాకవి నీవిచ్చెదవా? || మందలో ||
