#575Telugu Spiritual Song
Unnatha stalamulapai - nekkinchi choopinchu prabhu
ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
ప|| ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
ఎన్నతగిన మహారక్షణ శిఖరము - సుందరమొందు సదా
1. మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె
మరణపు ముల్లును విరచి జయంబును - యేసు అనుగ్రహించెన్ || ఉన్నత ||
2. ఎవరు మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో
దైవశాంతి నొంది క్రీస్తుతో నిలిచి - సంతస మొందెదరు || ఉన్నత ||
3. ఆశ్చర్యకరుడాయనే - ఆలోచన కర్తయును
నిశ్చయముగా బహుబుద్ధి - వివేకము లిచ్చి నడుపు సదా || ఉన్నత ||
4. చంచల హృదయులును - ముష్కరులగు పాపులును
వంచన లేక వాక్యమునకు తల - వంచి విధేయులలొదురు || ఉన్నత ||
5. కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను
నడువుడి త్రోవయిదేయను శబ్దము - చెవులకు వినబడును || ఉన్నత ||
6. పక్షిరాజు తనదు - పిల్లల కాచెడు రీతి
రక్షణ కర్త యెహోవా - నిన్ను కాచి రక్షించు సదా || ఉన్నత ||
7. సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు
అందమైన యా పరలోక రాజ్యము - ప్రబలుట చూచెదవు || ఉన్నత ||
