18px
#576Telugu Spiritual Song

Jayamu pondumani Yesu cheppenu

జయము పొందుమని యేసు చెప్పెను - జయించువారె స్వాస్థ్యమొందెదరు

ప|| జయము పొందుమని యేసు చెప్పెను - జయించువారె స్వాస్థ్యమొందెదరు
1. జయవంతులే దైవ పరదైసులోనున్న జీవవృక్ష ఫలమును భుజియింతురు - రెండవ మరణమును దాటెదరు || జయము ||
2. మరుగైన మన్నానిచ్చి మరి తెల్లరాతినిచ్చు ఆ రాతి మీద క్రొత్త్త పేరుండును - ఎరిగెదరు దాని పొందువారలె || జయము ||
3. ఎవరు అంతమువరకు స్థిరముగ నిలిచెదరో ఏలెదరు జనులను అధికారులై - ఇనుపదండముతో పరిపాలించెదరు || జయము ||
4. ధవళ వస్ర్తములను ధరింపజేయువారికి జీవగ్రంథమున పేరు తుడవబడదు-దేవ దూతలయెదుట ఘనత కలుగును || జయము ||
5. ఆలయ స్తంభముగా వారిని దేవుడు నిలిపి స్థిరపరచి దీవించును - నూతన యెరూషలేమని ్రవాయువారిపై || జయము ||
6. వారిని దేవుడు సింహాసనముపైన కూర్చుండబెట్టి జీవమకుట మిచ్చును - వారసులై నిత్యముగా జీవింతురు || జయము ||