18px
#577Telugu Spiritual Song

Prabhu yesu naa rakshakaa – nosagu

ప్రభుయేసు నా రకక్షకా నొసగు కన్నులు నాకు నిరతము

ప|| ప్రభుయేసు నా రకక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను జూడ - అల్ప్ఛయు నీవే - ఓమేగయు నీవే
1. ప్రియుడైన యోహాను పత్మాసులో - ప్రియమైన యేసూ నీ స్వరూపము ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె - ప్రియ ప్రభు నిను జూడనిమ్ము || ప్రభు ||
2. లెక్కలేనిమార్లు పడిపోతిని - దిక్కులేనివాడ నేనైతిని చక్కజేసి నా నేత్రాలు దెరచి - గ్రక్కున నిన్ను జూడనిమ్ము || ప్రభు ||
3. ఎఱిగి యెఱిగి నే చెడిపోతిని - యేసు నీ గాయము రేపితిని మోసపోతి నేను - దృష్టి దొగితి - దాసుడ నన్ను చూడనిమ్ము || ప్రభు ||
4. ఎందరేసుని వైపు చూచెదరో - పొందెదరు వెల్గు ముఖమున సందియంబు లేక సంతోషించుచు - ముందుకు పరుగెత్తెదరు || ప్రభు ||
5. విశ్వాసకర్తా ఓ యేసుప్రభూ - కొనసాగించువాడా యేసుప్రభూ వినయముతో నేను నీవైపు జూచుచు - విసుగక పరుగెత్త నేర్పు || ప్రభు ||
6. కంటికి కనబడని వెన్నియో - చెవికి వినబడని వెన్నియో హృదయ గోచరము కాని వెన్నియో - సిద్ధపరచితివా నాకై || ప్రభు ||
7. లోక భోగాలపై నా నేత్రాలు - సోకకుండునట్లు కృప జూపుము నీ మహిమ దివ్య స్వరూపమును - నిండార నను జూడనిమ్ము || ప్రభు ||