18px
#578Telugu Spiritual Song

Nee priya prabhuni sevakai-arpinchuko neeve

నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవె

ప|| నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవె పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననె
1. అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే ఆ వెలుగు ద్వారానే - నూతన మార్గము కలిగె సజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే || నీ ప్రియ ||
2. తప్పిపోతివి గతమందు - తప్పుదారిని నడిచితివి తన ప్రేమాహస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్ || నీ ప్రియ ||
3. ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమని ప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించె నీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచు కొనుము || నీ ప్రియ ||
4. యెవరతని సేవించెదరో - ఫలమొందెదరంతమందు ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీకిచ్చె కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని || నీ ప్రియ ||