18px
#579Telugu Spiritual Song

Meeru bahuga phalinchinacho – mahima kalugunu thandriki –

మీరు బహుగా ఫలించినచో - మహిమ కలుగును తండ్రికి

ప|| మీరు బహుగా ఫలించినచో - మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై యుండెదరు
1. నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదరు కక్షామములో తృప్తి నిచ్చి క్షేమముగా - మిమ్ము నడిపించును బలపరచును మీ యొముకలను - అధికముగా ఫలించుడి || మీరు ||
2. చెట్లులేని మెట్టలలో నదుల ప్రవహింపజేయు ప్రభువు - ఎండియున్న నేలనెల్ల నీటిబుగ్గలుగా జేయువాడు - మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి || మీరు ||
3. వడిగా ప్రవహించు నదిని బోలి - విస్తరింపజేయు తన శాంతిని - ఐశ్వర్యముతో నింపునిమ్ము - ముదిమివరకు మిమ్ము మోయువాడు - మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి || మీరు ||
4. పాడెదరు మూగవారు - గంతులు వేసెదరు కుంటివారు - పొగెడెదరు ప్రజలెల్లరు - ప్రభుని ఆశ్చర్యకార్యములను మహిమ ఘనత చెల్లించుచు - హల్లెలూయ పాడెదరు || మీరు ||