#580Telugu Spiritual Song
Naa praana priyudaa-Naa Yesu prabhuvaa
నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా
ప|| నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం
1. నీ సత్యము సమాజములో నీ నీతిని - నా హృదయములో
దాచియుంచలేరు ప్రభు - స్తుతియాగముగా నూతన గీతము నే పాడెద || నా ||
2. జ్ఞానులకు నీ సందేశం - మతకర్తలకు నీ ఉపదేశం
అర్థము కాకపోయెనే - పతితలెందరో - నీ జీవజలములు త్రాగితిరే త్రాగితిరే || నా ||
3. నా యెడ నీకున్న తలంపులు - బహు విస్తారములై యున్నవి
వాటిని వివరించి చెప్పలేనే అవి అన్నియును
లెక్కకు మించినవైయున్నవి - ఐ యున్నవి || నా ||
