#582Telugu Spiritual Song
Halleluya Sthuthi mahima
హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు - దేవుని కిచ్చెదము
ప|| హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు - దేవుని కిచ్చెదము
ఆ...ఆ....ఆ... హల్లెలూయ హల్లెలూయ (2)
1. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతించెదము
బండ నుండి మధుర జలమును పంపిన - ఆ యెహోవాను స్తుతించెదము || హల్లె ||
2. అలసైన్యమునకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము || హల్లె ||
3. ఆకాశము నుండి అగ్నిని పంపిన - ఆ దేవుని స్తుతించెదము
సేవకుల నోటిని అభిషేకించిన - ఆ యెహోవాను స్తుతించెదము || హల్లె ||
