18px
#584Telugu Spiritual Song

Dhaiva krupalo nenaashrayinchi- Thana adugulalo nadachi

దైవకృపలో నేనాశ్రయించి - తన అడుగులలో నడచి

ప|| దైవకృపలో నేనాశ్రయించి - తన అడుగులలో నడచి వెంబడించెద యేసు మార్గమును
1. మనోవేదనలు పలు శోధనలు నా జీవితకాలమంతా ఎగసి వచ్చినను నే భయపడను - యెహోవా నన్ను చేరదీయును || దైవ ||
2. ఈ లోకము దాని సుఖమైనను మనశ్శాంతి నాకు ఇవ్వదు. నా యేసయ్య పాద సన్నిదిలో అనుదినము నాకానందమే || దైవ ||
3. పలు నిందలు అవమానములు నాపైబడి - కృంగదీసిన నా యేసయ్యా తన హస్తముతో నన్ను లేవనెత్తి నిలబెట్టును || దైవ ||
4. ఆయా రోగములు ఆయా వ్యాధులు నన్ను వేధించి బాధించిన భయము లేదికను దిగులులేదికను - నన్ను స్వస్థపరచు యేసు ఉన్నాడు || దైవ ||
5. సుఖ దుఃఖములు కలిమిలేములు మరి ఏదైన నాకు కల్గిన నేను విడువను నా యేసయ్యను నా జీవిత కాలమందు || దైవ ||
6. నా శత్రువులు నన్ను బెదిరించిన నే భయపడి వెనుదిరగను ప్రార్ధింతును విశ్వసింతును నా యేసుకు అప్పగించును. || దైవ ||
7. తల్లిమరచినను తండ్రి విడచినను బంధువులే త్రోసివేసినను నన్ను వదలడు నన్ను త్రోసివేయడు నా ప్రియ ప్రభువు సర్వకాలము || దైవ ||