#585Telugu Spiritual Song
Devuni stutiyinchudi-yellappudu- Devuni stutiyinchudi aa aa
దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు
ప|| దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు
దేవుని స్తుతియించుడి - ఆ....ఆ.....
1. అయన పరిశుద్ధ ఆలయమందు - ఆయన సన్నిధిలో
ఆ.....ఆయన సన్నిధిలో యెల్లప్పుడు || దేవుని ||
2. ఆయన బలము ప్రసిద్ధిచేయు - ఆకాశ విశాలమందు ఆ....
ఆకాశ విశాలమందు యెల్లప్పుడు || దేవుని ||
3. ఆయన పరాక్రమ కార్యముల బట్టి - ఆయన ప్రభావమును ఆ......
ఆయన ప్రభావమును యెల్లప్పుడు || దేవుని ||
4. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి - స్వరమండలముతో ఆ....
స్వరమండలముతో - యెల్లప్పుడు || దేవుని ||
5. సన్నతంతుల సితారతోను - చక్కని స్వరములతో ఆ....
చక్కని స్వరములతో యెల్లప్పుడు || దేవుని ||
6. తంబురతోను నాట్యముతోను - తంతి వాద్యములతోను ఆ....
తంతి వాద్యములతో - యెల్లప్పుడు || దేవుని ||
7. పిల్లన గ్రోవుల చల్లగ నూది - ఎల్ల ప్రజలు జేరి ఆ.....
ఎల్ల ప్రజలు చేరి - యెల్లప్పుడు || దేవుని ||
8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి
గంభీర తాళములతో ఆ.... - గంభీర తాళములతో యెల్లప్పుడు || దేవుని ||
9. సకల ప్రాణులెహోవాను స్తుతించుడి - హల్లెలూయ ఆమెన్ ఆ.....
హల్లెలూయ ఆమెన్ - ఎల్లప్పుడు || దేవుని ||
