#587Telugu Spiritual Song
Dhevude naa kaashrayambu
దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము మహా వినోదు
ప|| దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము మహా వినోదు
డాపదల స - హాయుడైనన్ బ్రోచును - అభయ మభయ - మభయ
మెప్పు - డానంద - మానంద మానంద మౌగ(2)
1. పర్వతములు కదలిన నీ - యుర్వి మారుపడినను
సర్వమున్ ఘోషించుచు నీ సంద్రముప్పొంగినన్
అభయ - మభయ - మభయ - మెప్పు - డానంద - మానంద మానంద మౌగ || దేవు ||
2. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్థిల్లును
ఆ తావునందు ప్రజలు మిగుల - ధన్యులై వసింతురు
అభయ - మభయ - మభయ - మెప్పు - డానంద - మానంద మానంద మౌగ || దేవు ||
3. రాజ్యముల్ కంపించిన - భూర్రాష్టముల్ - ఘోషించిన
పూజ్యుడౌ యెహోవా వైరి - బూని సంహరించును
అభయ - మభయ మభయ - మెప్పు డానంద మానంద మానంద మౌగ || దేవు ||
4. విల్లువరచు నాయనే తెగ - బల్లెము నరకు నాయనే
చెల్లచెదురుజేసి రిపుల నెల్లద్రుంచు నాయనే
అభయ - మభయ - మభయ - మెప్పు డానంద మానంద మౌగ || దేవుడే ||
5. పిశాచి పూర్ణబలము నాతో - బెనుగులాడ జడియును
నశించు శత్రు గణము - దేవు నాజ్ఞవలన మడియును
అభయ - మభయ - మభయ - మెప్పు డానంద - మానంద మానంద మౌగ || దేవుడే ||
6. కోటయు నాశ్రయమునై యాకోబు - దేవుడుండగ
వేటికింక నెరవవలయునెపుడు నాకు బండుగ
అభయ మభయ మభయ - మెప్పు డానంద డానంద డానంద మౌగ || దేవుడే ||
