18px
#589Telugu Spiritual Song

Geetam geetam jaya jaya geetam - cheyi tatti phaadedhamu

గీతం గీతం జయ జయ గీతం - చేయితట్టి పాడెదము

ప|| గీతం గీతం జయ జయ గీతం - చేయితట్టి పాడెదము
అ.ప. యేసురాజు లేచెను హల్లెలూయ - జయ మార్భటించెదము || గీతం ||
1. చూడు సమాధిని మూసిన రాయి - దొరలింపబడెను అందు వేసిన ముద్ర, కావలి నిల్చెనా - దైవసుతుని ముందు || గీతం ||
2. వలదు వలదు ఏడువ వలదు - వెళ్లుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగిలేచెను - పరుగిడి ప్రకటించుడి || గీతం ||
3. అన్నకయప వారల సభయు - అదరుచు పరుగిడిరి ఇంక దూతగణముల ధ్వనిని వినుచు - వణుకుచు భయపడిరి || గీతం ||
4. గుమ్మముల్ తెరచి చక్కగ - నడువుడి జయవీరుడు రాగ మీ మేళ తాళ వాయిద్యముల్ - బూరలెత్తి ధ్వనియించుడి || గీతం ||