18px
#591Telugu Spiritual Song

Jai Jai yesu raaja Jai Jai - Raajaadhiraajaa neeke jai

జైజై యేసురాజా - జైజై - రాజాధిరాజా నీకే జై

ప|| జైజై యేసురాజా - జైజై - రాజాధిరాజా నీకే జై
1. పాపకూపములో బడియున్న - నిన్ను జూచి చేయిజాచి చక్కగ దరికి చేర్చితివి || జైజై ||
2. సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా పరిహరించిన పావనుడగు నా ప్రభు యేసు || జైజై ||
3. నీతి హీనుడనైన నాకు నీతి రక్షణ వస్ర్తములను ప్ర"తితో నొసగిన నీతిరాజా || జైజై ||
4. మంటి పురుగునైన నన్ను మంటి నుండి మింట జేర్చిన మహా ప్రభుండా నీకే జైజై || జైజై ||
5. పాప శాపగ్రస్తుడనైయుండ - నన్ను గూడ నీ స్వకీయ సంపాద్యముగా జేసితివి || జైజై ||
6. రాజులైన యాజక గుంపులో నన్ను గూడ నీ సొత్తైన పరిశుద్ధ జనములో జేర్చితివి || జైజై ||
7. తల్లియైన మరచిన మరచును నేను నిన్ను మరువననిన నమ్మకమైన నా ప్రభువా || జైజై ||
8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది యంతము లేని దేవా యుగాయుగములకు నీకే జై జై || జైజై ||