#592Telugu Spiritual Song
Dhevudu meeku yellapudu - Thoduga nunnaadu
దేవుడు మీకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు
ప|| దేవుడు మీకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు (3)
1. ఏదేనులో ఆదాముతో నుండెన్ - హనోకుతోడ నేగెను
దీర్ఘ దర్శకులతో నుండెన్ - ధన్యులు దేవునిగలవారు తోడుగనున్నాడు || తో ||
2. దైవాజ్ఞను శివసావహించి దివ్యముగ నాబ్రాహాము
కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గమునెత్తిన యపుడు - తోడుగనున్నాడు || తో ||
3. యోసేపు ద్వేషింప బడినపుడు గోతిలో - త్రోయబడినపుడు
శోధనలో చెఱసాలయందు - సింహాసన మెక్కినయపుడు - తోడుగనున్నాడు || తో ||
4. ఎ్రర సముద్రపు తీరమునందు ఫరో - తరిమినదినమందు
యోర్ధాను దాటిన దినమందు - యెరికో కూలిన దినమందు తోడుగనున్నాడు || తో ||
5. దావీదు సింహము నెదిరించి ధైర్యాన చీల్చినయపుడు -
గొల్యాతును హతమార్చినయపుడు - సౌలుచే తరుమబడినపుడు తోడుగనున్నాడు || తో ||
6. సింహపు బోనులో దానియేలు షద్రకు మేసాకబెద్నెగో
అగ్ని గుండములో వేయబడెన్ - నల్గురిగా కనబడినపుడు తోడుగనున్నాడు || తో ||
7. సౌలు బంధించబడినపుడు పేతురు చెరలో నున్నప్పుడు
అపొస్తలులు విశ్వాసులు హింసించబడిన యపుడు - తోడుగనున్నాడు || తో ||
