#593Telugu Spiritual Song
Ha! : yentha adbhuthaashcharya dhinamu
హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం
1. హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం
నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె
హా! ఎంత జాలిగల మిత్రుడు హృదయ అక్కర తీర్చెను
మరణచాచ్ఛయలుపోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్
ప|| పరము దిగెను మహిమ నిండె నాలో - సిలువ యొద్ద స్వస్థత కలిగెను
నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను - పరము దిగెను మహిమ నిండె నాలో
2. పరిశుద్ధ ఆత్మలో జన్మించితి దేవుని గృహమందు
కల్వరి ప్రేమచే కల్గెనీతి - ఓ ఎంత ఔన్నత్యము
తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా
కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము || పరము ||
3. నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే
భవనములు నాకందున్నవని స్థిరముగనే - నమ్ముదున్
నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం
నిత్యైశ్వర్య మీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి || పరము ||
