18px
#595Telugu Spiritual Song

Aakaashamu bhuvilo nella yesu unnathudu

ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడు

1. ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడు - మనుజులు దూతలు దయ్యాలు యేసుకే మ్రెంుక్కెదరు
ప|| నే నమ్ముదు - నే నమ్ముదు యేసు నాకై మరణించెనని పాపంబు పోవ సిలువలో రక్తము చిందెను
2. రక్షకుడు ప్రాణము - బెట్టినది నా కొరకే వేరేమి వాగ్దాదంబులు - అక్కరయే లేదు || నే ||
3. ప్రతి పాప భయమంతయు - తీర్చు నామమిదే నరకదండన యందంతయు - తొలగించు నామము || నే ||
4. పాప సంకెళ్లు అన్నియు విడగొట్టును యేసు సాతాను వాని తలను - యేసు చితుకగొట్టెన్ || నే ||
5. పాపంబులో మరణించెడి - వారికి ప్రాణమిడున్ బలహీనమైన ఆత్మలకు - శక్తి నిచ్చును యేసు || నే ||