18px
#596Telugu Spiritual Song

Yehovaa nee krupaathishayamunu - Nithyamu kheerthinthun

యెహోవా నీ కృపాతిశయమును - నిత్యము కీర్తింతున్

ప|| యెహోవా నీ కృపాతిశయమును - నిత్యము కీర్తింతున్
1. తరతరములకు నీ విశ్వాస్యత - తెలియపరచెదను కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి - పాపము క్షమియించె (2) || యెహోవా ||
2. ప్రతి శోధనపై నీవు నాకు - విజయము నిచ్చెదవు నన్ను విడిపించుటకు నీవు - నమ్మదగినవాడవు || యెహోవా ||
3. నీదు వాత్సల్యము నాపై - నూతనముగా నుండున్ నీవు విశ్వాస్యత గొప్పదై - మారనిదై యుండున్ || యెహోవా ||
4. నీదు రాకడ వరకు నన్ను - నిందారహితునిగా నమ్మకమైయున్న నా ప్రభువా - నన్ను కాచెదవు || యెహోవా ||
5. మంచి పోరాటము పోరాడి - జయమును పొందెదను మహిమ మకుటము నిచ్చెడు ప్రభునకు - హల్లెలూయ పాడెదన్ || యెహోవా ||