#597Telugu Spiritual Song
O praardhanaa su praardhanaa-Nee
ఓ ప్రార్థనా సు ప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా?
1. ఓ ప్రార్థనా సు ప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ ముఖాముఖిన్ - నెబ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమౌసు ప్రార్థనా - నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు - నో ప్రార్థనా సు ప్రార్థనా - నీ
2. పిశాచి నన్ను యుక్తితో - వశంబుచేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే - నా శంకలెల్లా మానుపున్
నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా
నా శోకమెల్ల దీర్చెడు విశేషమైన ప్రార్థన - నా శోక
3. నీ దివ్యమైన రెక్కలే - నా దుఃఖభారమెల్లను
నా దేవుడేసుచెంతకు - మోదంబు గొంచుబోవును
సదా శుభంబులొందను - విధంబు జూప నీవెగ
నీ ధైర్యమిచ్చు ప్రార్థనా - సుధాసుధార ప్రార్థనా - నా ధైర్య
4. అరణ్యమైన భువిలో - నా రమ్యమౌ పిస్గా నగం
బురంగుగాను నెక్కి నా - చిర గృహంబు జూతును
శరీరమున్ విదల్చినే - బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్ - బరే శు ధ్యాన ప్రార్థనా - కరంబు
