18px
#598Telugu Spiritual Song

Pagatilo megha sthambamugaa – Raathrilo yagni sthambamugaa

పగటిలో మేఘ స్తంభముగా - రాత్రిలో యగ్ని స్తంభముగా

1. పగటిలో మేఘ స్తంభముగా - రాత్రిలో యగ్ని స్తంభముగా రక్షకుడవుగా నుండి ప్రభువా - సుఖశాంతితో గాచితివి
ప|| ధన్య ధన్య ధన్య ప్రభుకు - తానే రక్షణ మన కొసగే నీ సన్నిధికి నడిపి ప్రభువా - రాత్రింబవళ్లు గాచితివి
2. వాక్యమన్నాతో పోషించి - బండనీళ్లను త్రాగించితివి ఆత్మకు తృప్తినిచ్చి ప్రభువా - శాంతిని నాకిచ్చితివి
3. ఆత్మీయ సుందర హృదయములో - ఆత్మ ప్రాణ శరీరములో ఆత్మీయజీవ మొసగి - ప్రభువా - ఆత్మను మేల్కొలిపితివి
4. కానానులోనికి తెచ్చితివి - పరిశుద్ధులతో జేర్చితివి ప్రణుతించెదను నిన్ను ప్రభువా - సాగిలపడి పూజింతున్