18px
#599Telugu Spiritual Song

Prabhuvaa pampu varshamunu-nee

ప్రభువా పంపు వర్షమును - నీ వాగ్ధానములు స్థిరపరచి భీకర ధ్వనితో రానిమ్ము

ప|| ప్రభువా పంపు వర్షమును - నీ వాగ్ధానములు స్థిరపరచి భీకర ధ్వనితో రానిమ్ము
1. ఏలియా మొరపెట్టగానే - మేఘములు కారుగమ్మెను మోపైన వాన భువిపైన గురిసే - మా దీన ప్రార్థన వినుమా || ప్రభు ||
2. కడవరి వానా కాలమున - వర్షము దయచేయుమిలలో పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను - మెరుపులను పుట్టించుము || ప్రభు ||
3. దేవా! నీ స్వాస్థ్యము మీద - సమృద్ధిగా కురిపించుము దాహముతోను దప్పినమమ్ము - బలపరచి స్థిరపరచుము || ప్రభు ||
4. ఆత్మీయ గొడ్డుతనములో - నలమటించుచున్న మాకు ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి - ఉజ్జీవింపజేయు మమ్ము || ప్రభు ||
5. నా నోట నగ్ని తగిలించి - మా దోషమంతా తొలగించి పంపుము దేవా - నిన్ను సేవించుటకు - ప్రాపుగ ప్రకటింపనిమ్ము || ప్రభు ||