18px
#600Telugu Spiritual Song

Premaa premaa - Premaa priyudavu neevu

ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే - ఆనంద మానందమే

ప|| ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే - ఆనంద మానందమే
1. నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యా నీ ప్రేమధికమయ్యా నాపై - నీ ప్రేమధికమయ్యా || ప్రేమా ||
2. పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావా ప్రేమ తెలియగలనా - నీ ప్రేమ లోతు నెరుగగలనా!
3. ద్రోహినై ఎన్నాళ్లో నిన్ను - గాంచక తిరిగితినయ్యా ప్రేమతో నా ప్రియుడా - నన్ను కౌగలించితివే || ప్రేమా ||
4. ఇహలోక సకల మహిమ - పువ్వులవలె వాడిపోవున్ వాడదే అయ్యా - నీ ప్రేమ - వాడిపోదయ్యా || ప్రేమా ||
5. నీ ప్రేమ మాధుర్యమును - వివరింప తరమౌనే నాకు అతి సులభముగనే పరమున - వివరించగలను || ప్రేమా ||