#601Telugu Spiritual Song
Poorna hrudhaya sthothramul - chellinchedha prabhunake
పూర్ణ హృదయ స్తోత్రముల్ - చెల్లించెద ప్రభునకే
ప|| పూర్ణ హృదయ స్తోత్రముల్ - చెల్లించెద ప్రభునకే
1. ఏర్పరచుకోలేదు నేను - ప్రభువే నన్నేర్పరచుకొనెన్
పాపినైన నాకు - ఆయనే రక్షణ నిచ్చెన్(2)
పరలోక రాజ్యములో - భాగమునిచ్చెన్(2)
2. నా హృదయ పాపములను - తన రక్తములో కడిగెన్
మృతమైన నా ఆత్మను - జీవింపజేసె ప్రభు
ఉచితంబుగానే పొందితి - నిత్య జీవం
3. నే పాపబంధములో నుండ - హృదయమశాంతితో నిండె
నా పాప మొప్పుకొనగా - కడిగెను రక్తములో
శాంతి ఆనందముతో - నన్ను నింపెన్
4. వర్ణింపజాలను నేను - ప్రభు యొక్క గొప్ప ప్రేమన్
పాపిని నిను ప్రేమించెన్ - మరువలేనా ప్రేమను
ప్రశంసలను పాడెద - ప్రభునకే
5. నిత్య రాజ్యము నన్ను చేర్చ - నిత్య నిబంధన చేసె
సుఖదుఃఖములందైన - ముగింతు నాదు పరుగున్
స్థిరముగ నుందు పరమును చేరువరకు
