#602Telugu Spiritual Song
Rajadhiraajaa raave - Raaju Yesu raajyamela raave
రాజాధిరాజా రావే - రాజు యేసు రాజ్యమేల రావే
ప|| రాజాధిరాజా రావే - రాజు యేసు రాజ్యమేల రావే
రాజులకు రాజువై రావే - రవికోటి తేజ యేసు రావే
ఓ...... మేఘ వాహనంబు మీద వేగమే - ఓ.... మించు వైభవంబుతోడ వేగమే
1. ఓ...... భూజనంబులెల్ల తేరి చూడగా - ఓ.....నీ జనంబు స్వాగతంబు నీయగా
నీ రాజ్య స్థాపనంబు చేయ - భూరాజులెల్ల గూలిపోవ
భూమియాకాశంబు మారిపోవ - నీ మహాప్రభావమున వేగ
2. ఆ.... ఆకసమున దూతలార్భటింపగా - ఆ.... ఆది భక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్య వీధిలోన - ఏకమై మహాసభచేయ
యేసునాథ! నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ
3. ఓ... పరమ యెరూషలేము పుణ్యసంఘమా!
ఓ.... గొర్రెపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా
పరమదూతలారా! భక్తులారా! పౌలపోస్తులారా!
పెద్దలారా! గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్త్త గీతమెత్తి పాడరారా
