#606Telugu Spiritual Song
Andaala thaara arudenche naakai - ambaraveedhilo
అందాలతార అరుదెంచె నాకై అంబరవీధిలో
1. అందాలతార అరుదెంచె నాకై అంబరవీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని జాటుచున్
ఆననందసంద్రముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిమి || అందాల ||
2. విశ్వాసయాత్ర దూరమెంతైన - విందుగ దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో - విజయపధమున
విశ్వాలనేలెడి దేవకుమారుని - వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ || అందాల ||
3. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు
ఎరిగినదారి తొలగినవేళ యెదలో కృంగితి
యేసయ్యతార - యెప్పటివోలె యెదురాయె త్రోవలో
ఎంతో యబు"రపడుచు విస్మయమొందుచు యేగితి స్వామికడకు || అందాల ||
4. ప్రభుజన్మ స్థలము పాకయేగాని - పరలోకసౌధమే
బాలునిజూడ జీవితమంత - పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగ - ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్థన || అందాల ||
