#609Telugu Spiritual Song
Choodumu getsemane - thotalo naa prabhuvu
చూడుము గెత్సెమనె - తోటలో నా ప్రభువు
ప|| చూడుము గెత్సెమనె - తోటలో నా ప్రభువు
పాపి నాకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది
పాపి నీకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది
1. దేహమంతయు నలిగి - శోకము చెందినవాడై
దేవాది దేవుని ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే || చూడుము ||
2. తండ్రి ఈ పాత్ర తొగున్ - నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నప్పగించితివనెను || చూడుము ||
3. రక్తపు చెమట వలన - మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు హృదయము పగులగ - విజ్ఞాపనము చేసెనే || చూడుము ||
4. ముమ్మారు భూమి మీదపడి - మిక్కిలి వేదనచే మన యేసు
ప్రభువు తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే || చూడుము ||
5. ప్రేమామృత వాక్కులచే - ఆదరించెడి ప్రభువు
వేదన సమయమున - బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెనే || చూడుము ||
6. నన్ను తనవలె మార్చెడి - ఈ మహా ప్రేమను తలచి
తలచి హృదయము కరుగగ - సదా కీర్తించెదను || చూడుము ||
