18px
#614Telugu Spiritual Song

Jeevitaanthamu varaku neeke - seva salpudunantini =

జీవితాంతము వరకు నీకే - సేవసల్పుదునంటిని

ప|| జీవితాంతము వరకు నీకే - సేవసల్పుదునంటిని నీవు నాతోనుండి ధైర్యము - నిచ్చినడుపుము రకక్షకా || జీవితాం ||
1. ఎన్ని యాటంకంబులున్నను - ఎన్ని భయములుకల్గిన అన్ని పోవును నీవు నాకడ - నిన్న నిజమిది రకక్షకా || జీవితాం ||
2. అన్ని వేళల నీవు చెంతనె - యున్న యనుభవమీయవె తిన్నగానీమార్గమందున - పూనినడచెద రకక్షకా || జీవితాం ||
3. నేత్రములు మిరుమిట్లు గొలిపెడి - చిత్ర దృశ్యములున్నను శత్రువగుసాతాను గెల్వను చాలు నీ కృప రకక్షకా || జీవితాం ||
4. నాదు హృదయమునందు వెలుపట - నావరించిన శత్రులన్ చెదరగొట్టుము రూపుమాపుము - శ్రీఘముగా నా రకక్షకా || జీవితాం ||
5. మహిమలో నీవుండు చోటికి - మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటిన దాక - నిన్ను వీడనంటిని రకక్షకా || జీవితాం ||
6. పాప మార్గము దరికి బోవక - పాత యాశల గోరక ఇప్పుడు నిన్నే వెంబడింపగ - కృప నొరంగుము రకక్షకా || జీవితాం ||