#615Telugu Spiritual Song
Jyotigaa mamu jeyumo devaa
జ్యోతిగా మము జేయుమో దేవా - ఈ లోకమున మీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా
ప|| జ్యోతిగా మము జేయుమో దేవా - ఈ లోకమున మీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా
జ్యోతిగా మము జేసి మాలో - క్రీస్తు ప్రేమను బయలుపరచి
నీతి ప్రేమలతోడ హృదయము - నింపి మము నడిపింపుమయ్యా || జ్యోతిగా ||
1. నిన్ను దెలియని యాత్మలెన్నెనో - మా చుట్టునున్నవి
నీ కొరకు కనిపెట్టుచున్నవయా - అన్ని వేళల నీ సువార్తను
అందరికి ప్రకటింప మనసున - నాశనిడి నీ వార్తవెలుగును
అన్ని దిశలకు జాటునట్లుగ || జ్యోతిగా ||
2. మా కుటుంబములోన నీ వెలుగు - ప్రసరించునట్లుగ
నాదు బ్రతుకును శుద్ధిజేయుమయ్యా - మా కుటుంబములోని వారలు
మానకనునీ వెలుగు జూపగ - మమ్ము నీ మార్గంబునందున
మనుప పరిశుద్ధాత్మ నిడుమా || జ్యోతిగా ||
3. సంఘమున నీ కీర్తి కనపడగ - పరిశుద్ధ సహవాసంబులో
నను వృద్ధిజేయుమయా - భంగపరచెడి కక్షలన్నిటి
బాధపరిచెడి శక్తులన్నిటి - పారదోలగశక్తినిడినీ - భక్తికాంతిని జూపినాలో || జ్యోతిగా ||
4. సమయమును వరములనొసంగితివి - మా రకక్షకాధన - సంపదను
నీవే యొసంగితివి - విమల జీవితమందు వానిని విరివిగా నీ తరులకొసంగి
వీర త్యాగార్పణములతో నీ - వెలుగు ప్రసరింపంగజేయను || జ్యోతిగా ||
