#617Telugu Spiritual Song
Mahimaa nireekshana mana prabhu yese aayane naalo unnaadu
మహిమా నిరీక్షణ మన ప్రభుయేసే - ఆయనే నాలో వున్నాడు
ప|| మహిమా నిరీక్షణ మన ప్రభుయేసే - ఆయనే నాలో వున్నాడు(2)
ప్రభుయేసు ప్రియయేసు మహిమ నిరీక్షణయే
1. అద్భుతమైన మహిమ నిరీక్షణ - యేసుని రక్తము ద్వార కలిగెను
ఆ నిరీక్షణలో సదా జీవింతును
2. ఈ జీవితములో యాత్రికుడను - సిలువనెత్తుకుని సాగిపోయెదను
ఆ నిరీక్షణలో పరుగెత్తెదను
3. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే - చావైతే నాకు ఎంతో లాభం క్రీస్తుతోనుండ నాకెంతో మేలు
