18px
#619Telugu Spiritual Song

Maargamu choopumu intiki naa thandri intiki

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి

ప|| మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి
1. పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించే కక్షామము పశ్చాత్తాపమునొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము || మార్గము ||
2. ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణిభోగములెల్ల బ్రతుకు ధ్వంసముచేసే దేవా నిన్ చేరితి దేహియని నీవైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము || మార్గము ||
3. దూరదేశములోన బాగుండుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము దాక్షిణ్యమూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యునిజేయుము || మార్గము ||
4. కొడుకునేకాదనుచు గృహమే చెరశాలనుచు కోపించి వెళ్లితి కూలివానిగనైన నీ యింట పనిచేసి కనికరమే కోరుదు కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము || మార్గము ||
5. నా తండ్రి నను జూచి పరుగిడుచు ఏతెంచే నాపైబడి ఏడ్చెను నవజీవమును కూర్చి ఇంటికి తోడ - ్కని వెళ్లి నన్ను దీవించెను నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును || మార్గము ||