18px
#620Telugu Spiritual Song

Naavanni angeekarinchumee – devaa

నావన్ని అంగీకరించుమీ దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ

ప|| నావన్ని అంగీకరించుమీ దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ - నావన్ని కృపచేత నీవలననొందిన - భావంబునను నేను బహు ధైర్యమొందెద
1. నీకు నా ప్రాణము నిజముగనర్పించి - నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద || నా ||
2. సత్యంబు నీ ప్రేమ - చక్కగా మదిబూని - నిత్యంబుగరముల నీ సేవ జేసెద || నా ||
3. నీ సేవజరిగెడు - నీయాలమునకు - నాసచేనడిపించు - మరల నా పదములు || నా ||
4. పెదవులతోనేను బెంపుగనీవార్త - గదలకప్రకటింప - గలిగించు దృఢభక్తి || నా ||
5. నావెండికనకంబు నా తండ్రి గైకొనుమీ - యావంతయైనను నాశింపమదిలోన || నా ||
6. నీవునా కొసగిన నిర్మలబుద్ధిచే - సేవజేయగనిమ్ము - స్థిరభక్తితో నీకు || నా ||
7. చిత్తము నీ కృపా - యత్తంబుగావించి - మత్తిల్లకుండగ మార్గంబుదెలుపుము || నా ||
8. హృదయంబునీకిత్తు - సదనంబుగావించి - పదిలంబుగా దాని బట్టి కాపాడుము || నా ||