18px
#621Telugu Spiritual Song

Nee chetitho nannu pattuko - nee aathmatho nannu nadupu

నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు

ప|| నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పిచేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము (2)
1. అంధకార లోయలోన - సంచరించినా భయము లేదు నీ వాక్యం శక్తిగలది - నా త్రోవకు నిత్య వెలుగు (2) || నీ చేతితో ||
2. ఘోరపాపిని నేను తండ్రి - పాప ఊబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను (2) || నీ చేతితో ||
3. ఈ భువిలో రాజునీవే - నా హృదిలో శాంతినీవే కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము నీ సేవ చేసెదన్ (2) || నీ చేతితో ||