18px
#623Telugu Spiritual Song

Nenunu naa yinti vaarunu neethi sooryuni goluthumu –

నేనును నా యింటివారును నీతిసూర్యుని గొలుతుము

ప|| నేనును నా యింటివారును నీతిసూర్యుని గొలుతుము దీనమనసు గలిగి దేవుని దివ్య సేవనుజేతుము
1. అనుదినంబును ప్రభుని దలచుచు - అలయకను ప్రార్థింతుము అనవరత మా ప్రభుని చిత్తము - ననుకరింతుము పనులలో
2. వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము - ఆదరంబున దైవచిత్తము - ననుసరించుచు నడుతుము
3. ఆశతోడను ప్రభుని దినమును - నాచరింతుము మరువక - విసుకుజెందక నాలయమునకు - పిన్న పెద్దల దెత్తుము
4. సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్ర"తితో - భంగపరచెడి పనులన్నిటి - కృంగదీసెదమనిశము
5. ప్రేమతోడను పొరుగువారిని - ప్రియులుగను భావింతుము - క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము
6. శక్తిగొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము - భక్తితో హృదయమును పూర్తిగ - ప్రభునికే యర్పింతుము
7. చిన్నవారలు దైవరాజ్యపు - చిరుతవారసులంచును - అన్నివేళల వారి వృద్ధికి - మిన్నగ దొడ్పడెదము
8. పెద్దవారలు దైవజనులని - పేర్మితో భావింతుము - శుద్ధుడగు ప్రభుక్రీస్తు మనసును - శ్రద్ధతోడను జూపుచు
9. జీవితంబున ప్రభును ప్రేమా - శీసులను ప్రసరింతుము - దివ్యజ్యోతుల రీతి వెలుగుచు - దివ్య సన్నిధి నుందుము