18px
#624Telugu Spiritual Song

Neetho samamevaru – neelaa preminchedevaru = neelaa

నీతో సమమెవరు - నీలా ప్రేమించేదెవరు - నీలా క్షమియించేదెరు - యేసయ్యా

ప|| నీతో సమమెవరు - నీలా ప్రేమించేదెవరు - నీలా క్షమియించేదెరు - యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు (2)
1. లోక బంగారము ధనధాన్యాదులు - ఒక పోగేసిన నీతో సరితూగునా జీవనదులన్నియు సర్వసంద్రములు - ఒకటై ఎగసినా - నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒకచోట క్రుమ్మరించిన - నీవేగా చాలిన దేవుడు || నీతో ||
2. పలు వేదాలలో మత గ్రంథాలలో - పాపమేసోకని పరిశుద్ధుడేడి పాపపరిహారార్థం సిలువమరణమొంది - తిరిగిలేచినట్టి దైవనరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా - నీవేగా మంచి దేవుడవు || నీతో ||
3. నేను వెదకకున్నా నాకు దొరికితివి - నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలుచేసి తరచురేపితిని - నన్నెంతో సహించి క్షమియించితివి నీలా జాలిగల ప్రేమ గల దేవుడేడి - నీవేగా విమోచకుడవు || నీతో ||