#625Telugu Spiritual Song
Noothana parachumu devaa - nee kaaryamulu naa yedala
నూతనపరచుము దేవా - నీ కార్యములు నా యెడల
ప|| నూతనపరచుము దేవా - నీ కార్యములు నా యెడల(2)
1. సంవత్సరాలెన్నో జరుగుచున్నను - నూతనపరచుము నా సమస్తము(2)
పాతవి గతించిపోవును - సమస్తం నూతమగును -
నీలోఉత్సహించుచు - నీకై ఎదురుచూతును || నూతన ||
2. శాశ్వతమైనది నీదు ప్రేమ - ఎన్నడైన మారనిది నీదు ప్రేమ(2)
దినములు గడచినా - సంవత్సరాలెన్ని దొర్లినా -
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) || నూతన ||
3. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో - నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
తరములలో ఇలా - సంతోషకారణముగా - నన్నిలచేసినావు నీకే స్తోత్రము (2) || నూతన ||
