#626Telugu Spiritual Song
O Israyelu nee bhaagya mentha goppadhi
ఓ ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది - యెహోవా రక్షించిన నిన్ను పోలినవారెవ్వరూ
ప|| ఓ ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది - యెహోవా రక్షించిన నిన్ను పోలినవారెవ్వరూ
1. పరమతండ్రికి జ్యేషష్ఠసుతుడవు - వరముల నొందిన యాజకుడవు
పోరాడి మరి గెలచిన వాడవు - వీరుడవు ప్రభు యోధుడవు || ఓ ఇశ్రాయేలు ||
2. నిన్ను సృజించిన యెహోవా దేవుడు - ఎన్నడెన్నడు మారనివాడు
ఇశ్రాయేలును కాపాడువాడు - కునుకడు నిద్రపోడు || ఓ ఇశ్రాయేలు ||
3. నిన్ను పిలచిన యెహోవా దూత - యేసేగా మోక్ష ప్రధాత
సర్వప్రాణికి జీవనదాత - జగమంతటికి అది నేత || ఓ ఇశ్రాయేలు ||
