#627Telugu Spiritual Song
Painunna aakaasa manduna - krindunna bhooloka manduna
పైనున్న ఆకాశమందున - క్రిందున్న భూలోకమందున
ప|| పైనున్న ఆకాశమందున - క్రిందున్న భూలోకమందున
లేదు రక్షణ - యే నామమున - లేదు పాప విమోచన
1. అన్ని నామములకు పైన కలదు - ఉన్నంతబగు యేసుని నామము
యేసునామములో శక్తిగలదు (2) - దోషులకు శాశ్వత ముక్తి గలదు.
2. యేసు నామములో నిత్యజీవం - శాశ్వతానంద నిత్యశాంతి
యేసు నామములో పాపశుద్ధి - విశ్వసించినచో సమృద్ధి
3. అలసి సొలసిన వారికి విశ్రం - జీవములేనివారికి జీవం
నాశనమునకు పోయేడివారికి - యేసు నామమే రక్షణమార్గం
4. యేసునామము స్మరియించగానే - మనస్సు మారి నూతనమగును
బేధమేమియులేదెవ్వరికిని - నాధుని స్మరియించి తరింప
