#628Telugu Spiritual Song
Praardhinchu chuntivaa viswaasi
ప్రార్థించుచుంటివా విశ్వాసి - ప్రార్థన మరువకుమా పరదేశి
ప|| ప్రార్థించుచుంటివా విశ్వాసి - ప్రార్థన మరువకుమా పరదేశి(2)
1. ప్రార్థనే నీ పాపభారమెల్ల దించెనే - పరుని దాస్య బంధములను తెంచివేసెనే
పరిశుద్ధుని చెంత చేర్చెనే - ప్రాణమునకు సేదదీర్చెనే || ప్రార్థించు ||
2. ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించెనే - ప్రార్థనే ఎడారిలో దాహమీయునే
ప్రార్థనే నిన్ను నడుపునే - ప్రార్థనే కడకు చేర్చునే || ప్రార్థించు ||
3. ప్రార్థనే పరిశుద్ధ సీమ ప్రేమగీతము - ప్రార్థనే ప్రార్థించు యేసునామ సంకీర్తనం
ప్రార్థనే ప్రభునికాహ్వానము - ప్రార్థనే తండ్రికి సోపానము || ప్రార్థించు ||
4. ప్రార్థనే పసివానిచేత ప్రేమ పతాకము - ప్రార్థనే పరలోక రాజ్య
విజయ శంఖారావము - ప్రార్థనే విప్లవ పాఠము, ప్రార్థనే పోరాట నియమము
5. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము
ప్రార్థనే ప్రభునుండి మనము పొందు సూత్రము
ప్రార్థనే క్షేమ మందిరము - ప్రార్థనే పరమ ప్రాకారము || ప్రార్థించు ||
