#629Telugu Spiritual Song
Prabhuvuku thaginatlu prudhivilo priyudaa
ప్రభువుకు తగినట్లు పృదివిలో ప్రియుడా - పదిలముగా జీవించవా
ప|| ప్రభువుకు తగినట్లు పృదివిలో ప్రియుడా - పదిలముగా జీవించవా (2)
1. ఆదామవ్వలవలె నీవు సహా - కేవలము దిగంబరివైయుండ
ఆ దేవ గ్రొరెపిల్ల చావొందె సిలువలో - పావన వస్ర్తములనిచ్చెన్
2. శ్రేషష్ఠబలినిచ్చి హేబేలు - సృష్టికర్తయొక్క సాక్ష్యము పొందె
అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా - హతసాక్షిగ నీవుండెదవా?
3. ప్రభుయడుగుజాడలను పరికించి - ప్రభుకనుకూలంబుగా నడచినచో
హనోకువలె ఆ రెండవ మరణము - నొందక ప్రభుతో నుండెదవు
4. పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభు సర్వాంగకవచమున్ కల్గి
నీతిన్ ప్రకటించిన నోవాహున్బోలి - ఖ్యాతి సువార్తన్ చాటుమిలన్
5. మృతులను సహ లేపు మహాత్ముడని - తన సుతునర్పించె నబ్రహామేమ్
మృతికిలోనగు నీ శరీరంబును - అతనికే బలిగా నర్పించు
6. తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకు - మౌనమున్ జూటి మరణముగోరే
కడు శ్రమకాలములో ఖండించె ఖడ్గము - ముంగిట నీవట్లుండెదవా
7. యెహోవా భయమునొంది యోసేపు - ఎంత వైభవమనుభవించెనోగాంచు
నీ జీవితంబులో దైవభయమునొంది - అక్షయ కిరీటమున్బొందు
