18px
#630Telugu Spiritual Song

Rakshakun dudhayinchinaadata manakoraku parama

రక్షకుండుదయించినాడట మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట

ప|| రక్షకుండుదయించినాడట మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు - రారెగొల్ల బోయలారా తక్షణమునబోయి మన - ని - రీక్షణ ఫలమొందుదము || రక్షకుండు ||
1. దావీదు వంశమందు - ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన - దిక్కుగోరి చూచినాడు || రక్షకుండు ||
2. గగనము నుండి డిగ్గి - ఘనుడు గబ్రియేలుదూత తగినట్టు చెప్పెవారికి - మిగుల సంతోషవార్త || రక్షకుండు ||
3. వర్తమానము జెప్పి దూత - వైభవమున పోవుచున్నాడు కర్తను జూచిన వెనుక - గాంతుము విశ్రమంబప్పుడు || రక్షకుండు ||
4. పశువుల' - ట్టిలోన భాసిల్లు వస్ర్తములజుట్టి శిశువునుగనుగొందురని శ్రీఘముగను దూతతెల్పె || రక్షకుండు ||
5. అనుచు గొల్లలొకరికొక - రానవాలు జెప్పుకొనుచు అనుమతించి కడకు గ్రీస్తు - నందరికి దెల్పినారు || రక్షకుండు ||