18px
#631Telugu Spiritual Song

Samarpana cheyumu prabhuvunaku

సమర్పణ చేయుము ప్రభువునకు - నీ దేహము ధనము సమయమును

ప|| సమర్పణ చేయుము ప్రభువునకు - నీ దేహము ధనము సమయమును(2)
1. అబ్రహమును అడిగెను ప్రభువప్పుడు - ఇస్సాకును అర్పణ ఇమ్మనెను(2) నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) - నీ విచ్చెదవా నీ విచ్చెదవా || సమర్పణ ||
2. .ప్రభువును ప్రేమించినపేదరాలు - కాసులు రెండిచ్చెను కానుకగా(2) జీవనమంతయు దేవునికిచ్చెను (2) - నీవిచ్చెదవా నీ విచ్చెదవా || సమర్పణ ||
3. నీ దేహము దేవుని ఆలయము - నీ దేవుడు మలిచిన మందిరము(2) సజీవయాగముగా నిచ్చెదవా (2) - నీవిచ్చెదవా నీ విచ్చెదవా || సమర్పణ ||